మహబూబాబాద్: పట్టణంలోని జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ మహేందర్ రెడ్డి..
మహబూబాబాద్ పట్టణంలోని జేఎన్టీయూ యూనివర్సిటీ లో సైబర్ నేరాలపై విద్యార్థులకు టౌన్ సిఐ మహేందర్ రెడ్డి మంగళవారం సాయంత్రం 5:00 లకు అవగాహన కల్పించారు.. సీఐ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఎక్కువగా సోషల్ మీడియా లో వచ్చే ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు.. ఈ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు.