ఎలమంచిలి: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నరసరావుపేటకు చెందిన డ్రైవర్, క్లీనర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న ట్రాలీని ఫ్రూట్స్ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.