శ్రీశైలం: రైలు ఢీకొని మృతి చెందిన పెద్దపులి నంబర్T- 160F ( ఆడపులి) గా గుర్తించిన అటవీశాఖ ఆదికారులు
నంద్యాల-గిద్దలూరు రైలు మార్గంలో చలమ, బొగద సమీపంలో గూడ్స్ రైలు ఢీకొని ఆదివారం రాత్రి పెద్దపులి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన పెద్దపులిని T-160F (ఆడ పులి)గా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాని వయసు సుమారు నాలుగు నుంచి ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. ఇటీవల ఇదే రైలు మార్గంలో చిరుత పులి, ఎలుగు బంట్లు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి ఈ హీరో రైలు మార్గంలో తరచు అడవి జంతువులు మృతి చెందడంతో జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు