శ్రీశైలం: మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండ తోటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫార్మ్ పాండ్‌ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా గురువారం పరిశీలించారు.గ్రామంలో అమలవుతున్న సహజ సిద్ధ వ్యవసాయ విధానాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి సాగు పద్ధతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు హుస్సేన్ రెడ్డి తన పొలంలో వీడ్ మ్యాట్స్ వినియోగంతో రోజ్ సాగు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేరిగోల్డ్ సాగు చేస్తున్న విధానాన్ని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఆయిల్ పామ్ తోటల్లో సాగు చేస్తున్న అంతర పంటలు, పీఎండీఎస్ (ఫ్రీ మూన్ సన్ డ్రై సోయింగ్) విధానంలో చేపడుతున్న వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.