మండపేట: మండపేట పట్టణంలో న్యాయమే గెలిచిందంటూ దళిత యువకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పాలాభిషేకం..
28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత న్యాయమే గెలిచిందంటూ దళిత యువకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పాలాభిషేకం నిర్వహించారు. వెంకటాయపాలెం శిరో శిరోముండనం కేసులో ప్రధమ ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో సహా పదిమందికి శిక్ష వేస్తూ ప్రత్యేకంగా న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ నేపధ్యంలో మండపేట కరాసిసెంటర్లో దళితుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.