Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: ఘనంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారి వార్షిక కుంభోత్సవం. సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు సమర్పణ

Srisailam, Nandyal | Apr 7, 2026
శ్రీశైలం మాక్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాస పౌర్ణమి తరువాత వచ్చిన మంగళవారం సందర్భంగా ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలు, జపపారాయణలు సంప్రదాయబద్ధంగా అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు.తదనంతరం ఆలయ ముందుభాగంలో రజకునిచేత ముగ్గు వేయించి అమ్మవారికి మొదటి విడత సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలను ఆలయ ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు, భక్తులు సమర్పించారు.