విశాఖపట్నం: శక్తి పథకం ద్వారా నష్టపోయిన ప్రతి ఆటో మ్యాక్సీ డ్రైవర్స్ కు నెలకు 5,వేల రూలు జీవన భృతి ఇవ్వాలి. ఆటో డ్రైవర్ల ర్యాలీ.
విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం గిరిజన భవనం నుండి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆఫీస్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు గంటా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేసిన ఆటో డ్రైవర్లు, శక్తి పథకం ద్వారా నష్టపోయిన ప్రతి ఆటో మ్యాక్సీ డ్రైవర్స్ కు నెలకు 5,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డీజిల్, సిఎన్జి గ్యాస్ పెట్రోలు ఇంధన చార్జీలపై 50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేసారు.