శ్రీశైలం: పాములపాడు మండలం రుద్రవరం వద్ద జాతీయ రహదారి 340(సి)పై రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొన్న బైకు ఒకరి పరిస్థితి విషమం
పాములపాడు మండలం రుద్రవరం సమీపంలోని జాతీయ రహదారి 340(సి)పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బైక్‌పై నందికొట్కూరు వైపు వెళ్తున్న యువకు డు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన మహేష్ (25)గా పోలీసులు గుర్తించారు.స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.