కూటమి ప్రభుత్వం అవలభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమ పోరుకు పిలుపునిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు కర్నూలు ఎస్టీబిసి కళశాల నుండి రాజ్ విహార్ వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కాపాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ప్రజా సంఘాలు, న్యాయవాదులు విద్యార్థులు ర్యాలీకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు తీరును ఎండగడుతూ ప్రభుత్వ మెడికల్ కళశాలను ప్రైవేట్ పరంకాకుండా మద్దతు ఇచ్చి ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి విశేషణంగా అదరణ లభించింది.