ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, రైతులు ఆందోళన..
నందవరంలో వర్షం.. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని, ఎమ్మిగనూరు గోనెగండ్ల,నందవరం మండలాలలో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్షం పత్తి, వేరుశనగ, ఉల్లి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.