నిర్మల్: బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ముత్యం రెడ్డి నియామకం
Nirmal, Nirmal | Oct 18, 2026 బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా దిలావర్పూర్ మండల నాయకుడు దొడ్డికింది ముత్యం రెడ్డి నియమితులయ్యారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముత్యం రెడ్డి పేర్కొన్నారు.