ఎమ్మిగనూరు: ఎస్బిఐలో ఉద్యోగం పేరిట రూ. 5 లక్షల మోసం, కర్నూలు ఎస్పీ కు ఫిర్యాదు చేసిన బాధితుడు...
ఎమ్మిగనూరు: ఎస్బిఐలో ఉద్యోగం పేరిట రూ. 5 లక్షల మోసం తన భార్యకు ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి, రూ.5 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన కొండయ్య జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు సోమవారం కర్నూలులో ఫిర్యాదు చేశారు. మాసుమాన్ దొడ్డికి చెందిన ఉపేంద్ర తనకున్న పరిచయాలతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకొని మోసం చేశాడని బాధితుడు కొండయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.