శ్రీశైలం: పాములపాడు మండలం ఎర్ర గూడూరు తెలుగుగంగ బ్రిడ్జిపై బైకును ఢీకొన్న ట్రాక్టర్. ఇద్దరికీ గాయాలు ఒకరి పరిస్థితి విషమం
పాములపాడు మండలం ఎర్రగూడూరు తెలుగుగంగ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఇద్దరికీ చికిత్స అందిస్తున్నప్పటికీ, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రాక్టర్ వేగంగా వచ్చి బైకును ఢీకొడంతా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలియజేశారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.