పొన్నూరు: ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు కూటమి ప్రభుత్వం దాసోహం అయింది: యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు కూటమి ప్రభుత్వం దాసోహం అయిందని, ఉపాధ్యాయులను బోధనేతర పనులు చేయిస్తూ, రావలసిన బకాయిలు ఇప్పటికీ ఇవ్వడం లేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు ఆరోపించారు. శుక్రవారం పొన్నూరులో యూటీఎఫ్ రుణభేరి ర్యాలీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.