శ్రీశైలం: ఆత్మకూరులో దారి తప్పుతున్న బాల్యం.కూరగాయల సంత మార్కెట్ లో దొంగతనం. సిసి కెమెరా లో రికార్డు నమోదు
నంద్యాల జిల్లా ఆత్మకూరులో దారి తప్పుతున్న బాల్యం ఆందోళన కలిగిస్తోంది. కూరగాయల సంత మార్కెట్‌లో స్కూల్ విద్యార్థులు చోరీకి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ముగ్గురు విద్యార్థులు మార్కెట్‌లోకి చొరబడి దొంగతనానికి యత్నించారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ వారి కదలికలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.స్కూల్ యూనిఫాంలో ఉన్న చిన్నారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పిల్లలపై తల్లిదండ్రులు కచ్చితంగా నిఘా పెట్టాలని స్థానికులు సూచిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులుచిన్నారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి.