అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్నయ్య నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో గురువారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో డిప్యూటీ కలెక్టర్గా సెలక్ట్ అయిన వై సురేష్ కుమార్ ను ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చెన్నారెడ్డి మాట్లాడుతూ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ పూర్వ విద్యార్థి సురేష్ కుమార్ సెలెక్ట్ అయ్యి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ చేయడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో మరింత మంది ఇలాంటి విజయాలు సాధించాలని ప్రిన్సిపల్ చెన్నారెడ్డి పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ పలువురు హెచ్వోడీలు పాల్గొన్నారు.