హిందూపురం మోడల్ కాలనీ-2 లో వార్డు పర్యటన నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్ ఎమ్మెల్యే బాలయ్య PA లు
హిందూపురం పట్టణంలో మోడల్ కాలనీ-2 నందు వార్డు పర్యటనలో మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్, మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులు శ్రీనివాసులు, వీరయ్య, బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మోడల్ కాలనీ-2 ఏరియాలో ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని రోడ్లు కాలువలు నిర్మాణం చేపడతామని, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్డు ప్రజలకు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో త్వరలో విడుదల కానున్న 92.5 కోట్ల రూపాయల్లో వార్డులను అభివృద్ధి దిశకు తీసుకెళ్తామని తెలియజేశారు.