శ్రీశైలం: మహానంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో SIR కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు
మహానంది మండలం మహానంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు బుధవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ చేపట్టనున్న "సర్" కార్యక్రమంపై నాయకులు విస్తృతంగా చర్చించి, కార్యక్రమం లక్ష్యాలు, నిర్వహణ విధానం, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన బాధ్యతలను వివరించారు. బూత్ కన్వీనర్లు, బీఎల్ఏలు, యూనిట్ ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు "సర్" కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సూచనలు అందించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ శివశంకర్ చౌదరి, పాల్గొన్నారు