శ్రీకాకుళం: పాతపట్నం సమీపంలోని హరిద్వారం రైల్వే ట్రాక్ వద్ద రైలు ఢీకొని సుమారు 10 ఆవులు మృతి
పాతపట్నం సమీపంలోని హరిద్వారం రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం రైలు ఢీకొని సుమారు 10 ఆవులు మృతి చెందాయి. స్థానికుల వివరాలు మేరకు విశాఖ నుంచి గునుపూర్ వెళ్లే రైలు ఢీకొనడంతో ఆవులు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆవుల యజమానులు రోదించారు. ఆవులు మేతకు వెళ్లిన సమయంలో ఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు అంటున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.