నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోములలో వెలసిన శ్రీ విష్ణుకంటి క్షేత్రాన్ని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాదవ్ కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం దర్శించుకున్నారు. విష్ణుకంటి క్షేత్రం నిర్వాహకుడు కంబగిరి స్వామి, ఉపాసకుడు రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్పీకర్కు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.