అనకాపల్లి: అనకాపల్లిలో మద్యం దుకాణాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి పట్టణం మరియు రూరల్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ జగదీష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో ఎలాంటి అక్రమ నిల్వలు లేవని అధికారులు వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.