అనంతపురం జిల్లా అయ్యవారిపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలం జాతీయ రహదారిపై ఉన్న అయ్యవారిపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో నగరానికి చెందిన తేజ మరియు చరణ్ అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు