గుంతకల్లు: గుత్తి పట్టణంలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు, అదుపులోకి తెస్తున్న ఫైర్ ఇంజన్
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. రాయలసీమ ఫ్యూయల్స్ అనే పరిశ్రమ పక్కన పడేసిన వ్యర్థ పదార్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుంతకల్లు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు అదుపు చేసేందుకు యత్నించిన రాత్రి 9 అయినా అదుపులోకి రాలేదు. సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసే చిప్స్ కు వినియోగించే వ్యర్థాలు అంటున్నట్టు ఫ్యాక్టరీ యజమాని తెలిపారు. అయితే పెను ప్రమాదం తప్పింది