ఇంద్రవెల్లి: సమక్క గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
రైతులు సిసిఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.సోమవారం ఇంద్రవెల్లి మండలంలోని మార్కెట్ యార్డు పరిధిలోని సమక్క గ్రామంలో గల మిత్తల్ జీన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం రైతులు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.రైతులు తమ పండించిన పంటలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మాలని సూచించారు.