విశాఖపట్నం: పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఆదేశాల మేరకు పలు PS లలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీస్ అధికారులు
డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు పోలీస్ స్టేషనులో కౌన్సిలింగ్ నిర్వహించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి విషయాల్లో గాని తల దూర్చరాదని మరియు సత్ప్రవర్తనతో వ్యవహరించాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం మరియు పీడీ యాక్ట్ అమలుచేయడం జరుగుతుందని తెలియజేశారు.