గుంటూరు: విద్య ,వైద్య రంగంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుంది: బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు రాథోడ్
Guntur, Guntur | Sep 14, 2025 ఆల్ ఇండియా బంజారా సేవాసంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరు నగరంలో జరిగింది. సంఘ జాతీయ అధ్యక్షుడు టి.సి రాథోడ్ అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. భావితరాల అభ్యున్నతికి తమ సంఘం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. విద్య, వైద్యంలో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తండా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రతి ఒక్కరు బంజారా సేవా సంఘం లో సభ్యులుగా చేరాలని సూచించారు.