మెట్పల్లి: దసరా పండుగ నేపథ్యంలో జగిత్యాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ అశోక్ కుమార్
దసరా ఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలను ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతే 112కు కాల్ చేయాలని సూచించారు.