గ్రామాల్లో ఆకతాయిలు, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో తీవ్రంగా నష్టపోతున్న ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తకు అండగా నిలబడుతామని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన పాటిల్ చంద్రశేఖర్ రెడ్డి అరటి తోటను మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త సంస్కృతి తీసుకొచ్చారని అన్నారు..ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.