పలమనేరు: జాతీయ లోక్ అదాలత్ లో 203 కేసులు పరిష్కారం, 1,13,84,842/- రికవరీ - సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఆదినారాయణ
పలమనేరు: సీనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఆదినారాయణ తెలిపిన సమాచారం మేరకు. క్షణికవేశంలో జరిగిన సంఘటనల వలన పలమనేరు పరిధిలోని కోర్టులలో సివిల్ మరియు క్రిమినల్ కేసులుగా బ్యాంకు లోన్ ల విషయంలో BSNL కేసులు మరియు అన్ని రకాల కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 203 కేసులు పరిష్కరించాబడ్డాయి. ఇందులో 16సివిల్ కేసులు,154 క్రిమినల్ కేసులు మరియు 33 బ్యాంకు కేసులు పరిష్కరించారు. మొత్తం రికవరీ 1 కోటి 13 లక్షల 84 వేల 842 రూపాయలుగా తెలిపారు.