శ్రీశైలం: పులుల సంయోగ సమయం కాబట్టి రేపటి నుంచి మూడు నెలల పాటు నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రవేశం నిషేధం
నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రాలకు రేపటి నుంచి 3 నెలల పాటు విరామం ప్రకటించారు. పెద్దపులుల సంయోగ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ పెద్దపులుల సాధికార సంస్థ ఎన్‌టీసీఏ ఆదేశాల మేరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎకో టూరిజం, జంగిల్ సఫారీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేష్ అప్పావ్ తెలిపారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.ఆత్మకూరు, మార్కాపురం అటవీ డివిజన్‌ల పరిధిలోని బైర్లూటి, పచ్చర్ల, తుమ్మలబైలు, ఇష్టకామేశ్వరి ప్రాంతాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రాలు, మూసివేశారు