హత్నూర: సీజేఐ పై దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో నిరసన
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సంగారెడ్డి పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాణిక్ మల్లేశం మాట్లాడుతూ మతోన్మాద గుండాల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి సిపిఎం నాయకులు పాల్గొన్నారు.