సిద్దిపేట అర్బన్: సమాచార హక్కు చట్టాన్ని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి
సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) 2005 ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, ఇదే విధంగా కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 17000 దరఖాస్తులను పరిష్కరించి జిరో గా చేయాలని జిల్లాలో పర్యటిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1 లక్ష 50 వేల మంది రాష్ట్రంలో సమాచార