కోడుమూరు: కర్నూలు రూరల్ ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం, టీడీపీ కైవసం అయిన పీఠం, చక్రం తిప్పిన కేడిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి
కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్ మండలం ఎంపీపీ పీఠాన్ని టిడిపి కనీసం చేసుకుంది. ప్రస్తుత వైసిపి ఎంపీపీ వెంకటేశ్వరమ్మ పై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా 13 మంది ఎంపీటీసీలు తీర్మానానికి మద్దతుకు పలికారు. ఇందులో వైసీపీ ఎంపీటీసీలు 5 మంది ఉన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం చేస్తున్న కృషి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పై నమ్మకంతో టిడిపికి మద్దతు నిలిచినట్లు వారు పేర్కొన్నారు.