మెట్పల్లి: జగిత్యాల: 63 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో పద్మ
జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీవో పద్మ 63 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు.