గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో తక్కువ వేతనాలు ఇస్తున్నారని సోలార్ ప్లాంట్ ఎదురుగా సెక్యూరిటీ సిబ్బంది నిరసన
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రెన్యూ సోలార్ ప్లాంట్ ఎదురుగా వేతనాలు తక్కువగా ఇచ్చారని సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేశారు. గ్రామంలోని సోలార్ ప్లాంట్ వద్ద బుధవారం సెక్యూరిటీ సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సోలార్ ప్లాంట్ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలదీశారు. గత ఐదు నెలలుగా ప్రతి నెల రూ.16వేలు వేతనం అందించి ఈ నెల రూ.10వేల నుంచి రూ.12వేలు మాత్రమే వేశారని అన్నారు. రోజు మూడు షిప్టులలో విధులను అంకితభావంతో నిర్వహించామని అయితే తక్కువ వేతనాలు ఇవ్వడం సరికాదన్నారు.