విలువైనటువంటి బంగారం నగదును లాకర్లలో దాచుకోండి దొంగతనాల నుంచి కాపాడుకోండి ప్రజలకు తెలియజేసిన డి.ఎస్.పి శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | Mar 31, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రజలకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు రోడ్లపై సరైన రక్షణ లేకుండా బైకులను వదిలి వెళ్ళకూడదు అన్నారు అదేవిధంగా విలువైనటువంటి బంగారం ఆభరణాలు నగదును ఇంట్లో కంటే లాకర్లో దాచుకుంటే రక్షణ ఎక్కువగా ఉంటుందని తెలిపారు వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాటి నుంచి కాపాడుకోవడానికి లాకర్లు సరైన ఎంపికన్నారు అంతేకాకుండా నివాస గృహాలలో మరియు నివాస గృహాల ముందు వెనుకవైపులలో సీసీ కెమెరాలు అమర్చుకుంటే దొంగతనం జరిగిన దొంగలను పట్టుకోవడం సులువుతుందని ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని డీఎస్పీ తెలిపారు