కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు నిర్వీర్యమయ్యే లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26 న జరిగే ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలిపారు. మంగళవారం నాడు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.