శ్రీశైలం: మహానంది మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.గోపవరం గ్రామంలో యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు
మహానంది మండలంలోని గోపవరం గ్రామంలో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే కొందరు వ్యక్తులు భారీ స్థాయిలో ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారని వారు పేర్కొంటున్నారు.పగలు, రాత్రి అనే తేడా లేకుండా యంత్రాల సహాయంతో మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అంటున్నారు.