పటాన్చెరు: గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ తో వాహనదారులకు ఇక్కట్లు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై బీసీ బంద్ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ మేర వాహనదారులు ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డారు. సిఐ నైముద్దీన్ ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.