పార్వతీపురం: రాయగడ - గుంటూరు ఎక్స్ప్రెస్లో పోలీసుల మెరుపు తనిఖీలు
పార్వతీపురం మన్యం జిల్లాలో రాయగడ - గుంటూరు ఎక్స్ప్రెస్ రైలులో మత్తు పదార్థాల నివారణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో సీసీఎస్, ఈగల్ టీమ్, రైల్వే పోలీసులు పాల్గొన్నారు. అనుమానాస్పద సమాచారం ఉంటే 1972 లేదా 112కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.