బుధవారం రోజున మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి కీసర మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి తాగునీరు, పుస్తకాలు, క్రీడా సామగ్రి, భవనాల మరమ్మతులు వంటి అవసరాలపై స్పందించారు. అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భోజన నాణ్యతను కూడా పరిశీలించారు.