నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్(NSTR)లో వన్యప్రాణుల పర్యవేక్షణ ప్రారంభమైంది, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్(AITE)మేరకు కచ్చితత్వమైన శాస్త్రీయ నిబంధనల ప్రకారం పెద్దపులులు,చిరుతలు, మాంసాహార జంతువుల అంచనా పక్రియ కొనసాగుతుంది, ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఆత్మకూరు అటవీ డివిజన్ లో గణనీయంగా పులులు, చిరుతల సంఖ్య పెరిగి ఉండొచ్చని డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేశ్ అప్పావ్ అన్నారు, నల్లమల అడవి ప్రాంతంలోని ఆత్మకూరు డివిజన్లో పెద్ద పులులు, చిరుతపులులు సంఖ్యా పెరగడం సంతోషకరమని ఆయన అన్నారు,