శ్రీశైలం: ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లా గిద్దలూరు పర్యాటన నేపథ్యంలో మహానంది మండలంలో ట్రాఫిక్ ఆంక్షలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణం శెట్టిపల్లె పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మహానంది మండలంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే వాహనాలకు ముందస్తు అనుమతి ఉంటే తప్ప ముందుకు సాగనివ్వలేదు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ ఆంక్షలు విధించినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మండలంలోని బోయలకుంట్ల మెట్ట- ఆంజనేయపురం వద్ద పోలీసులు భారీగేట్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు.సీఎం పర్యటన అనంతరం వాహనాల రాకపోకలు యధావిధిగా కోనసాగాయి.