నారాయణపేట్: మరికల్ పట్టణంలో బీసీ బందులో భాగంగా అపశృతి
తెలంగాణ రాష్ట్ర బందు లో భాగంగా నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బందు నిర్వహిస్తున్న సందర్భంగా మరికల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య ప్రకాష్ ను ఒక బైక్ శుక్రవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కాలు ఫ్రాక్చర్ కావడంతో పాటు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం అఖిలపక్ష నాయకులు 108 అంబులెన్సు లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి మెరుగైన వైద్యం కోసం పంపించారు.