శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలోని APS RTC బస్టాండ్ ఆవరణలో శ్రీ సీతారాముల ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ చేసిన MLA బుడ్డా రాజశేఖరరెడ్డి
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక APS RTC బస్టాండ్ ఆవరణలో ఎన్నో ఏళ్లుగా పూజలకు నోచుకోక పూర్వ వైభవానికి దూరమైన శ్రీ సీతారాముల ఆలయ పునఃనిర్మాణ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయ భూమి పూజ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా, ఘనంగా నిర్వహించబడింది.గతంలో ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి అనేక అడ్డంకులు ఎదురవగా, ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు మొదట్లో దీనికి అంగీకరించలేదు. అయితే భక్తుల చిరకాల ఆకాంక్షను గుర్తించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.