జర్నలిస్టుల సమస్యలపై బుధవారం మాసబ్ ట్యాంకు రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట టి యు డబ్ల్యూ జే, ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు కూకట్పల్లి ప్రెస్ క్లబ్ యూనియన్ జర్నలిస్టులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అక్రిడేషన్, ఆరోగ్య బీమా, ఇళ్ల స్థలాలు ఇస్తానని ఇచ్చిన హామీను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.