పటాన్చెరు: మైత్రి మైదానంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు
పటాన్చెరులోని మైత్రి మైదానంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడాలకు 420 మంది క్రీడాకారులు, 60 మంది శిక్షకులు, 160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు హాజరుకానున్నారు. తొలిసారి పటాన్చెరులో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సొంత నిధులతో భోజనం వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.