కోడుమూరు మండలంలోని అనుగొండ ఎస్సీ కాలనీలో ఆదివారం సుమారు 20 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. కాలనీ ప్రజల విన్నపం మేరకు టిడిపి మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి సమస్యను కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు ఆదివారం విద్యుత్ సిబ్బంది స్తంభాలు ఏర్పాటు చేశారు. దీంతో కాలనీవాసులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.