బ్యాంకర్లు రుణ పరిమితి పెంచాలి: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
వ్యవసాయానునుబంధ రంగాలకు రుణ పరిమితి పెంచాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఒక కుటుంబం, ఒక వ్యాపారవేత్తపై సచివాలయం స్థాయి వలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న బిజినెస్ కరస్పాండెంట్స్, రైతు సేవా కేంద్ర అధికారులు సమన్వయంతో బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించాలని సూచించారు.