ఆరూరులో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్: డిఎస్పి పైడేశ్వర రావు
సత్యవేడు మండలంలోని ఆరూరులో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన స్టాలిన్ అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు శ్రీసిటీ డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్వ్యూకు వెళుతున్న ఓ మహిళను బైక్పై ఎక్కించుకొని అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.